టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన భర్త చాహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ధనశ్రీ తను చేసిన ఓ పని వల్ల విపరీతమైన ట్రోల్స్‌కు గురైంది. ధనశ్రీ.. హిందీ పాపులర్ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగింది.
ఈ షో ఫైనల్ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌తో ధనశ్రీ వర్మ అత్యంత సన్నిహతంగా దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీంతో ధనశ్రీని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. భర్తను మోసం చేస్తూ ఇలాంటి పనులు చేయడం సరికాదని, నీకు పెళ్లైందని గుర్తుపెట్టుకో అంటూ కామెంట్లు చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ ధనశ్రీ వర్మ ఓ వీడియో విడుదల చేసింది.
"అస్సలు మీరు ఎలా ఏదో ఏదో ఊహించుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు దయచేసి మనుషులగా ఆలోచించండి. నేను ట్రోల్స్, మీమ్స్‌ను పట్టించుకోను. నా పనిని నేను చేసుకుంటూ పోతాను. కొన్నిసార్లు ఇటువంటి వాటిని చూసి నాలో నేను నవ్వుకుంటాను. కానీ ఈ సారి ఈ చెత్త ట్రోల్స్‌పై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి అవి నా కుటుంబాన్ని, నా సన్నిహితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
సోషల్ మీడియా వేదికల్లో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ అందరికి ఉంది. కానీ ఇతరుల వ్యక్తి గత జీవితాన్ని టార్గెట్ చేసి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. కొంత మంది ద్వేషాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. నా పనిలో సోషల్ మీడియా ప్రధాన భాగం కాబట్టి నేను విడిచిపెట్టలేను.
కాబట్టి మీరు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి.. మా ప్రతిభ, నైపుణ్యాలను గమనించాలని కోరుతున్నా. మేమంతా మిమ్మల్ని అలరించడానికే సోషల్ మీడియాలో ఉన్నాము. మీ అమ్మ, మీ సోదరి, మీ స్నేహితురాలు, మీ భార్య లాగే నేను కూడా ఒక స్త్రీని అనే విషయాన్ని మర్చిపోకండి.
నేను ఒక పోరాట యోధురాలిని. .ఏ విషయానికి భయపడి వెనకడుగు వేయను. ఇకనైనా ఈ వేదికగా ప్రేమను పంచండి. కాస్త సున్నితంగా వ్యవహరించండి. విద్వేషం వ్యాప్తి చేయకండి. మంచి విషయాలపై దృష్టి మీ జీవితంలో ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాని ధనశ్రీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment