కదం తొక్కిన కర్షకులు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కర్షకులు

Published Sat, Dec 14 2024 12:10 AM | Last Updated on Sat, Dec 14 2024 12:10 AM

కదం త

కదం తొక్కిన కర్షకులు

వినూత్నంగా ఎడ్లబండిపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి

రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం తక్షణమే విడుదల చేయాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద రైతులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తొలుత వీఆర్‌సీ కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం భారీగా తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ ధర్నా అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌కు వినతిపత్రం ఇచ్చారు.

ప్రతి విషయంలో రైతుల పక్షాన నిలబడతాం

నమ్మించి నట్టేట ముంచడం

బాబుకు అలవాటే

పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా అమలు చేయాల్సిందే

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

రైతుల భారీ ర్యాలీ, ధర్నా,

ఎండ్లబండ్ల ప్రదర్శన

అన్నదాతల ఆందోళనకు పార్టీ

సంపూర్ణ మద్దతు

సాక్షి, ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు (అర్బన్‌): చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పేరుతో సంవత్సరానికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని తుంగలో తొక్కి రైతుకు సున్నం పెట్టారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రైతులకు అందాల్సిన ప్రతి మేలు విషయంలో చంద్రబాబు మెడలు వంచి తీరుతామని, ఈ రోజు నిర్వహించిన ఉద్యమం ట్రయల్‌ మాత్రమే అని, ఇకపై మున్ముందు రైతు సమస్యలపై తీవ్రతరం చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12,500 చొప్పున నాలుగేళ్లు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పినా, అధికారంలోకి వచ్చాక మరింత పెంచి రూ.13,500 వంతున, ఐదేళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తర్వాత రైతుల గురించి ఆలోచించి వారికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. ఎరువులకు సంబంధించి రైతులు ముందుగానే డబ్బులు చెల్లించాలని, అప్పుడే ఎరువులు వస్తాయంటున్నారన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. దీంతో బస్తాకు రూ.300 నుంచి 400 వరకు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఎరువులు పార్టీలకతీతంగా రైతుభరోసా కేంద్రాల వద్ద ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ రైతులకు అండగా నిలబడి పోరాటాలు చేస్తూ ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. సర్వేపల్లిలో టెండర్లు పూర్తి కాకముందే పనులు చేసి రూ.కోట్లు దండుకుంటున్న ఘనులు టీడీపీ నేతలన్నారు. చంద్రబాబు నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, పెంచిన రూ.15 వేల కోట్ల కరెంట్‌ చార్జీలు తగ్గించాలని, ఈ నెల 27న, విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని జనవరి 3న ఆందోళనలు చేయబోతున్నామన్నారు.

చంద్రబాబు మోసపూరిత

బుద్ధి మారదు

– మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి

చంద్రబాబుది ఆది నుంచి మోసపూరిత బుద్దే. ఇది ఎప్పటికీ మారదు. ఈ దఫా అయినా చంద్రబాబు మారి ఉంటాడేమో, మంచి చేస్తాడేమో అని భ్రమపడిన రైతులు కూటమికి ఓట్లు వేశారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోవన్నట్లు చంద్రబాబు బుద్ధి మారలేదు. రైతులను మరోసారి మభ్యపెట్టారు. మేనిఫెస్టోను మార్చమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరగా మనం చేయగలిగిందే మేనిఫెస్టోలో పెట్టాం.. చేయలేనిది పెట్టలేమంటూ ఉన్నది ఉన్నట్లు చెప్పారు. చంద్రబాబులా దొంగ హామీలు మా నేత ఇవ్వలేదు.

సూపర్‌ సిక్స్‌లో

ఏ ఒక్కటీ అమలు చేయలేదు

– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,

కావలి మాజీ ఎమ్మెల్యే

సూపర్‌ సిక్స్‌ పథకాల పేరుతో చంద్రబాబు ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చి, మోసం చేశారు. ఆ పథకాలకు సంబంధించి మా ప్రభుత్వంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందించాము. వీరికి ఆర్థిక సాయం అందజేయకపోగా, కనీసం ఫలానాప్పుడు ఇస్తామనేది చెప్పడం లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేశారు. కావలి చెరువు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, సంగం–కావలి కాలువ పనులను మా ప్రభుత్వ హయాంలోనే చేపట్టాం. అవి ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.

అన్నదాతల నినాదాలతో

ప్రతిధ్వనించిన సింహపురి

వారితో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ ర్యాలీ

నెల్లూరు (బారకాసు): రైతుల నినాదాలతో నెల్లూరు నగరం ప్రతిధ్వనించింది. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగడుతూ రైతులు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కారు. వేలాదిగా తరలి వచ్చిన రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అన్నదాతను ఆదుకోవాలి, రైతులకు అండగా నిలవాలి, జై జగన్‌.. జైజై జగన్‌, జయహో జగన్‌.. నినాదాలు చేస్తూ భారీగా సాగిన ర్యాలీతో నగర రోడ్లు స్తంభించాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రైతుకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం, ధాన్యానికి కనీస మద్దతు ధర, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి, రైతుపై అదనపు భారం మోపే చర్యలను మానుకోవాలి వంటి ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులో నిర్వహించిన ‘అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమంలో భాగంగా రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వీఆర్సీ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి, పార్టీ పొలిటికల్‌ అడ్వైజర్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, కావలి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఉదయగిరి ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌, నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్‌ అహ్మద్‌, సెంట్రల్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీఏఏబీ మాజీ చైర్మన్‌ నిరంజన్‌బాబురెడ్డి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పూండ్ల అచ్యుత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతు పోరాటంలో భాగంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఐదు ఎడ్లబండ్లపై రైతులతో కలిసి చిల్ట్రన్స్‌ పార్కు నుంచి వీఆర్‌సీ వరకు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చంద్రశేఖర్‌రెడ్డి తలపాగా ధరించి ఎడ్ల బండిని నడుపుతూ రైతు ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

చంద్రబాబువి మోసపూరిత మాటలు

– కిలివేటి సంజీవయ్య,

సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసింది. చంద్రబాబు మోసపూరిత మాటలతో గద్దెనెక్కారు. మా ప్రభుత్వంలో సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఎన్ని విధాలుగా మేలు చేయవచ్చునో అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రికల్చర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందేలా చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు కొనేలా చేశారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ చంద్రబాబు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులను కలుపుకుని హామీలు అమలు చేసేంత వరకు పోరాడుతాము.

ఎన్నికల హామీలను అమలు పరచాలి

– ఆనం విజయకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ

ఇన్‌చార్జి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం

గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. దేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తు న్నారు. అలాంటి రైతులకు తక్కువ ధరలకే ఎరువులు ఇస్తామని, పెట్టుబడి సాయం రూ.20 వేలకు పెంచుతామని మాయమాటలు చెప్పారు. పార్టీలకతీతంగా రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రైతుల పక్షాన తాము పోరాడుతాం.

దేశంలో ఎవరూ చెప్పలేని అబద్ధాలు చంద్రబాబుకే సాధ్యం

– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ,

నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి

దేశంలో ఎవరూ చెప్పలేని అబద్ధాలు, చేయలేని మోసాలు చంద్రబాబుకే సాధ్యం. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల ఐఆర్‌, రైతులకు పెట్టుబడి సాయం, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుతో ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.

No comments yet. Be the first to comment!
Add a comment
కదం తొక్కిన కర్షకులు 1
1/7

కదం తొక్కిన కర్షకులు

కదం తొక్కిన కర్షకులు 2
2/7

కదం తొక్కిన కర్షకులు

కదం తొక్కిన కర్షకులు 3
3/7

కదం తొక్కిన కర్షకులు

కదం తొక్కిన కర్షకులు 4
4/7

కదం తొక్కిన కర్షకులు

కదం తొక్కిన కర్షకులు 5
5/7

కదం తొక్కిన కర్షకులు

కదం తొక్కిన కర్షకులు 6
6/7

కదం తొక్కిన కర్షకులు

కదం తొక్కిన కర్షకులు 7
7/7

కదం తొక్కిన కర్షకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement