బంగారు భవిష్యత్తును కోల్పోతారు
బాల్య వివాహాలతో బాలికలు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతారు. చిన్న వయస్సులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కర్నీ బాగా చదివించి వారు అనుకున్న లక్ష్యాల దిశగా ప్రోత్సహించాలి. అప్పటి వరకు వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.
– శింగంపల్లి నరసింహమూర్తి,
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
నియంత్రణ చాలా ముఖ్యం
బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ కట్టడి చేయాలి. వీటితో బంగారు భవిష్యత్తు నాశనమవుతుంది. చదువుకోవాల్సిన వయస్సులో బాలికలకు పెళ్లి చేయడం తగదు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి.
– అహ్మద్, ఉప సర్పంచ్, పడుగుపాడు
ప్రమాదంలో పడతారు
బాల్య వివాహాలు చేయడంతో గర్భం దాల్చిన బాలికలు అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. బిడ్డను మోసే సామర్థ్యం వారికి తక్కువగా ఉంటుంది. చిన్న వయస్సులో గర్భం దాలిస్తే బిడ్డతో పాటు తల్లి ప్రాణానికీ ప్రమాదమే. వీటికి దూరంగా ఉండాలి.
– పెంచలయ్య,
డీఎంహెచ్‌ఓ
●
Comments
Please login to add a commentAdd a comment