కుడి కాలువకు నీటి విడుదలలో జాప్యం
లింగసముద్రం: రాళ్లపాడు కుడి కాలువకు పూర్తిస్థాయిలో నీటి విడుదలలో జాప్యం జరుగుతుండడంతో వరినార్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల నుంచి నీరు విడుదల కాకపోవడంతో పంటను నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. రోజురోజుకు జాప్యం జరిగే కొద్దీ పోసిన నార్లు, నాటిన నాట్లు ఎండుముఖం పట్టి కలుపుతో గడ్డి అల్లుకుపోతుందని చెబుతున్నారు. బుధవారం కుడి కాలువకు 110 క్యూసెక్కులు వెళ్తోందని, ఇంకో 25 క్యూసెక్కులు కాలువకు విడుదల చేస్తే సరిపోతుందని ప్రాజెక్ట్ అధికారులు చెప్పారని, విడుదలైన నీరు మక్కెనవారిపాళెం, ఇసుకపాళెం పొలాల వరకే వెళ్తోందని, చినపవని పెదపవని చివరి భూములకు వెళ్లాలంటే పూర్తిస్థాయిలో కాలువకు నీరు విడుదల కావాల్సి ఉందన్నారు.
పంపింగ్ చేయకుండానే..
మేఘా సంస్థకు సంబంధించిన సిబ్బంది గురువారం కుడి కాలువ తూము వద్ద నీటిలో ఉండి పంపింగ్ చేసే 75 హెచ్‌పీ, 25 హెచ్‌పీ, 16 హెచ్‌పీ కలిగిన మూడు విద్యుత్ మోటార్లను క్రేన్ సహాయంతో అమర్చారు. అయితే 75 హెచ్‌పీ మోటార్ నీరు పంపింగ్ చేయకుండానే కాలిపోయింది. సాయంత్రం వరకు మిగిలిన రెండు మోటర్లు బిగించే ప్రయత్నంలోనే సిబ్బంది ఉన్నారు. అయితే తూము వద్ద సైఫన్ ద్వారా మరో రెండు పైపులు వేసి నీరు వెళ్లేలా చేస్తామని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
రోజులు గడిచే కొద్దీ ఎండుతున్న
నారుమడులు
మేఘా సంస్థ ద్వారా మోటార్ల ఏర్పాటు
నీరు పంపింగ్ చేయకుండానే
కాలిపోయిన మోటార్లు
Comments
Please login to add a commentAdd a comment