● డాక్టర్ ఖాదర్‌వలీ
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ పేర్కొన్నారు. నెల్లూరులోని పొదలకూరురోడ్డులో ఉన్న నవజీవన్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఎయిడ్స్ నివారణపై ప్రోగ్రమాటిక్ పాపులేషన్ అండ్ సైజ్ ఎస్టిమేషన్ (పీఎంపీఎస్‌ఈ) అనే అంశంపై జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఖాదర్‌వలీ మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతి ఎన్జీఓ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల్లో వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. హెచ్‌ఐవీతో బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించి వారికి ఉచితంగా మందులు అందించేలా చూడాలన్నారు. అలాగే రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఏపీసీయూ సిబ్బంది శివ, టీబీ నివారణ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment