చెప్పిందొకటి.. చేస్తోందొకటి
గత ప్రభుత్వంలో..
ఉదయగిరి: ఎన్నికలకు ముందు సవాలక్ష హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల మంజూరు కోసం ఎంతోమంది పేదలు ఆరునెలల నుంచి ఎదురు చూస్తునారు. కానీ ఇప్పటి వరకు కరుణించలేదు. అర్హులైన లబ్ధిదారులు కొత్త పింఛన్లు, కార్డులు కోసం నిత్యం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే తమకు ఓటు వేయలేదని, తమ పార్టీ వారు కాదని పెన్షన్లలో కోత పెట్టే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. జాబితాలు తయారు చేసి గ్రామసభల ద్వారా తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
పింఛన్లు తగ్గాయి
కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి జిల్లాలో 3.17 లక్షల సామాజిక పింఛన్లున్నాయి. ఆరునెలల్లో క్రమేణా తగ్గిపోయాయి. డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 3,09,462కు చేరింది. మరోవైపు కొత్త పింఛన్లు కోసం ఎంతోమంది దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియ నిరంతరం సాగేది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఏప్రిల్ 18న వెబ్‌సైట్‌లో నమోదు ప్రక్రియను నిలిపివేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఏం పట్టించుకోవడం లేదు. నేటికీ నమోదు చేపట్టకపోవడంపై జనం ఆగ్రహంగా ఉన్నారు.
రేషన్‌కార్డుల మంజూరులోనూ..
కొత్త రేషన్‌కార్డుల మంజూరులో కూడా ప్రభుత్వం ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యంతో వివిధ పథకాల లబ్ధిదారులతోపాటు, విద్యార్థులకు కూడా తీవ్ర నష్టం జరుగుతోంది. కార్డులు లేకపోవడంతో పథకాలు అందే పరిస్థితి లేదు. విద్యార్థులకు కాలేజీల్లో కౌన్సెలింగ్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రక్రియకు ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తెల్ల రేషన్‌కార్డులు ఎంతో అవసరం. ఇవి లేకపోతే సర్టిఫికెట్ల జారీలో రెవెన్యూ అధికారులు మెలిక పెడతారు.
అధికారులు ఏమంటున్నారంటే..
ఇంత వరకు కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని సంబంధిత అధికారులు చెబుతున్న మాట. త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతోందంటున్నారు. కొత్త రేషన్‌కార్డులపై కూడా ఎలాంటి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడిస్తున్నారు.
కొత్త పింఛన్లు ఇస్తారని ఆశగా ఎదురుచూసిన లబ్ధిదారులకు నిరాశ తప్పలేదు. రేషన్‌కార్డుల మంజూరులో కూడా ఇదే తంతు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆరునెలలు దాటినా ఇంతవరకు వాటిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మాయమాటలతో చంద్రబాబు నెట్టుకొస్తున్నారు. కోత విధించడంలో మాత్రం ముందున్నారు. దీంతో మోసపోయామని
లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
పింఛన్లకు ‘చంద్ర’ గ్రహణం
లబ్ధిదారుల్లో కోత
కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల ఊసే లేదు
నేటికీ వెబ్‌సైట్‌లో కనిపించని
నమోదు ప్రక్రియ
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు సచివాలయాల్లో దరఖాస్తు చేయించి పైసా ఖర్చు లేకుండా అనేక సేవలందించారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లు, నివాస పత్రాలు ఇలా ఎన్నో సేవలు ఉచితంగా అందాయి. కానీ కూటమి ప్రభుత్వం సచివాలయాలను నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉంది. మళ్లీ పాత విధానం వస్తే ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment