మృగంలా మారి.. లైంగికదాడికి పాల్పడి..
కావలి: పట్టణంలోని గాయత్రి నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల రంగప్రవేశంతో నీచుడి వ్యవహారమంతా బయటపడి స్థానికుల్లో కలకలం రేగింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనే విషయాలు తెలుస్తున్నాయి. వరుసకు అన్న భార్య అర్పితా బిస్వాస్‌ను మరిది నయ బిస్వాస్ దారుణంగా హత్య చేసి లైంగికదాడి చేసిన ఘటనలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. చంటి బిడ్డకు పాలిచ్చి ఆదమరిచి నిద్రిస్తున్న వదినను అనుభవించాలని నయ బిస్వాస్ రాక్షసుడిగా మారాడు. ఆమెను ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు. మృతదేహంపై దుస్తులు తొలగించి శారీరకంగా అనుభవించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని వంద మీటర్ల దూరంలో ఉన్న పంటకాలువ వద్దకు ఈడ్చుకెళ్లి అక్కడ మరోసారి తన కోరిక తీర్చుకున్నాడు. మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఇంటికొచ్చిన తర్వాత మృతురాలి దుస్తులు, హత్యకు వినియోగించిన రాడ్‌ను ఇంట్లో నుంచి బయటకు విసిరేసి రక్తపు మరకలు తుడిచేశాడు. తన దుస్తులను కూడా మార్చుకుని దర్జాగా బయటకు వెళ్లాడు.
Comments
Please login to add a commentAdd a comment