హిందూపురం: హంద్రీ–నీవా ప్రధాన కాలువను వెడల్పు చేయకుండా కేవలం లైనింగ్ పనులకు మాత్రమే పరిపాలన అనుమతులు ఇస్తూ జీఓలు జారీ చేయడం దారుణమని జల సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, నాయకుడు శ్రీనివాసులుతో కలసి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా 6,300 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా కాలువను వెడల్పు చేసేందుకు రూ.6,182 కోట్లను కేటాయించి 2021, జూన్ 7న జీఓ విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు కూడా జారీ చేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓను రద్దు చేయడమే కాక భవిష్యత్తులో కాలువ వెడల్పు పనులు చేపట్టేందుకు వీలు లేని విధంగా కేవలం లైనింగ్ పనులకు మాత్రమే పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీఓ విడుదల చేయడం దారుణమన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులకు మోకాలడ్డు పెట్టిన కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ ఈ నెల 20న ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని హంద్రీ–నీవా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద చేపట్టన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జలసాధన సమితి ఉమ్మడి
జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment