కె.ఎల్.ఎన్‌ే.పటలో భారీ చోరీ
● 16 తులాల బంగారం, 200 గ్రాముల వెండి మాయం
జలుమూరు: మండలంలోని జోనంకి పంచాయతీ కేఎల్‌ఎన్‌పేటలో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు పట్టుకుపోయారు. బాధితురాలు సనపల లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి తన భర్త నాగరాజు చైన్నెలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో 20 రోజుల క్రితం అక్కడికి వెళ్లింది. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి గేటు తాళం విరగ్గొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా రెండు బీరువాలు తెరిచి దుస్తులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. అందులో దాచిన సుమారు 16 తులాల బంగారం, 800 గ్రాముల వెండి ఆభరణాలు పోయినట్లు గుర్తించింది. హోం థియేటర్ సైతం దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏడు తులాల పోయినట్లు ఫిర్యాదు ఇవ్వమన్నారని, రశీదులు తెస్తేనే 16 తులాలు పోయినట్లు కేసు నమోదు చేస్తామంటున్నారని ఆమె వాపోయింది. తమ అత్తమామల నుంచి వచ్చిన బంగారం కొంత, కుమార్తె రజస్వల ఫంక్షన్‌కు మరికొంత బంగారం వచ్చిందని, వీటన్నంటికి రశీదులు ఎలా తెస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. సమాచారం అందుకున్న శ్రీకాకుళం క్లూస్ టీమ్, నరసన్నపేట సీఐ కె.శ్రీనివాసరావు, జలుమూరు ఎస్‌ఐ అశోక్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బీరువాలను పరిశీలిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment