గ్యాస్ సిలిండర్ల దొంగలు అరెస్టు
పొందూరు: మండలంలో గ్యాస్ సిలిండర్లు, సెల్‌ఫోన్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల గ్యాస్ సిలిండర్లు మాయమవుతున్నాయని, సెల్‌ఫోన్లు చోరీ అవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి టెక్కలి మండలం గోపీనాథపురం గ్రామానికి చెందిన కొమ్ము కార్తీక్, గాలి వెంకటేష్, నగిరి నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 సెల్‌ఫోన్లు, 30 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొమ్ము కార్తీక్, గాలి వెంకటేష్ గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వారని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment