ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్‌ఎంకె ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని అడ్డుపెట్టుకొని దొడ్డిదారిలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య, ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు కోటయ్య, పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, కొత్తపల్లి రేణుక, ఎర్ర అఖిల్ కుమార్, మల్లారెడ్డి, నరసింహారావు, సంగెం లింగయ్య, కాకి పాపిరెడ్డి, పరమేష్, పేర్ల నాగయ్య, నర్సయ్య, వాస పల్లయ్య, చంద్రకళ, సూరం రేణుక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment