కర్ణాటక: కోపంతో కుక్కను పొడిచి చంపిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మీంజూరు సమీపంలోని అత్తిపట్టు ప్రాంతానికి చెందిన రామమూర్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. రోడ్డుపై వెళ్లే వారిని ఆ కుక్కు తరచూ మొరిగేది. కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన శంకర్‌తోపాటు రామమూర్తి కుమారుడు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించేందుకు శంకర్, అతని స్నేహితులు ప్రభాకర్, రోహిత్ రామమూర్తి ఇంటికి వెళ్లారు. కుక్క మరోసారి వారిపై మొరగడంతో రామమూర్తికి, శంకర్ స్నేహితుల మధ్య తీవ్ర వాదన చోటుచేసుకుంది. అప్పటికే ఆగ్రహానికి గురైన శంకర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మరింత రెచ్చిపోయారు. కుక్కను కత్తితో పొడిచి చంపేశారు. రామమూర్తి మీంజూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంకర్, ప్రభాకర్, రోహిత్‌లను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment