ఫిలింనగర్: నగ్నంగా ఫొటోలు తీసి ఓ ‘గే’ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. షేక్‌పేట ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడు (గే). ఇటీవల గ్రిండర్ అనే డేటింగ్ యాప్‌లో అతనికి ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు.
ఈ క్రమంలో అతన్ని ఈ నెల 23న తన ఫ్లాట్ రావాలని ఆహ్వానించాడు. ఆ సమయంలో ఇద్దరూ శారీరకంగా కలుసుకునే క్రమంలో సదరు గుర్తు తెలియని వ్యక్తి అతనిని నగ్నంగా ఫొటోలు తీశాడు. తనకు రూ.15,000లు ఇవ్వాలని బాధితుడిని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో తన వద్ద అంత లేవని రూ.10,000లను యూపీఐ పేమెంట్ ద్వారా చెల్లించాడు. తనను బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment