తిరుపతి జిల్లా వివరాలు (గత ఐదేళ్లలో విద్యాభివృద్ధి పథకా
● జాడలేని విద్యార్థుల ట్యాబ్‌లు ● డిజిటల్ బోధనకు ప్రాధాన్యమివ్వని కూటమి పెద్దలు ● ఉన్నత చదువుకు దూరమవుతున్న పేద పిల్లలు ● ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ● మెరుగైన విద్యాప్రమాణాలకు గత ప్రభుత్వం అడుగులు
పథకం లబ్ధిపొందిన ఖర్చు చేసిన మొత్తం
పేరు వారి సంఖ్య రూ.కోట్లల్లో
ఉచిత ట్యాబులు 38,519 రూ.132.38
విద్యాదీవెన,
వసతిదీవెన 4,15,25 రూ.1045.24
గోరుముద్ద 9,37,220 రూ.715.10
విద్యాకానుక 9,37,220 రూ.158.24
అమ్మఒడి 9,37,220 రూ.1405.83
నాడు–నేడు 2,004 పాఠశాలలు రూ.715.04
మొత్తం రూ.4171.83
చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి ఎడ్యుకేషన్ :పేద విద్యార్థికి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలన్న సత్సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేశారు. ప్రభుత్వ విద్యావిధానంలో సంచలన మార్పులు తీసుకొచ్చారు. కోట్లాది రూపాయలతో నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. ప్రతి విద్యార్థీ చదువుకోవాలన్న సంకల్పంతో అమ్మఒడి, విద్యా దీవెన, జగనన్న విద్యాకానుక వంటి వినూత్న సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. నూతన విద్యావిధానాన్ని పటిష్టంగా అమలుచేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. కానీ ఇప్పుడు అవేవీ కనిపించకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరినాక కక్షసాధింపులకు దిగి పేద విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసింది.
గుదిబండలా ఫీజు రీయింబర్స్‌మెంట్
కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు గుదిబండలా పేరుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 1,15,348 మంది విద్యార్థులకు రూ.214.24 కోట్ల వరకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఫీజులు చెల్లించలేక చదువులు మానేసి పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
బడి ఈడు పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు జమచేసింది. ఐదేళ్ల్ల పాటు ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలుచేసింది. తిరుపతి జిల్లాలో 2,20,890మంది విద్యార్థులకు ఏటా రూ.331.34కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు దాదాపు రూ.1,657కోట్లు జమచేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి చేతులు పైకెత్తేసింది.
చిత్తూరులో అమ్మఒడి నిధులు విడుదల చేస్తున్న నాటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్)
సాంకేతిక చదువు
టెక్నాలజీని జోడించి విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆన్‌లైన్ విద్యారంగానికి పురుడు పోసింది. బైజ్యూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని శాంసంగ్ ట్యాబుల్లో బైజూస్ కంటెంట్‌ను ఇంగ్లిష్, తెలుగు మీడియాల్లో నిక్షిప్తం చేసింది. దాదాపు రూ.32వేల విలువైన ట్యాబులను 8వ తరగతి విద్యార్థులకు, అలాగే ఉపాధ్యాయులకు అందించింది. తద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యం రెట్టింపయ్యింది. పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ), స్మార్ట్ టీవీలను అందించి డిజిటల్ విద్యకు పెద్దపీట వేసింది. అయితే ప్రస్తుతం విద్యార్థులకు అందించే ట్యాబుల కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది.
అమ్మఒడికి పంగనామాలు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి 2,354 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులు చేసుకోవాలన్నా హెచ్‌ఎం ల వద్ద చిల్లిగవ్వ కూడా లేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న 6,785 మంది ఆయాలకు గత ఎనిమిది నెలలుగా జీతాలు కూడా మంజూరు చేయని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment