38 మందికి జరిమానా
తిరుపతి లీగల్: తిరుపతిలో మద్యం తాగి వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్న 38 మందికి ఒక్కొక్కరికీ పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ సోమవారం తీర్పు చెప్పినట్టు కోర్టు సూపర్‌ండెంట్ ఎన్‌వీ.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచారి ఆదేశాల మేరకు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు నగరంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు కోర్ట్ కానిస్టేబుల్ గిరిబాబు తెలిపారు. 2024 సంవత్సరంలో అధిక మోతాదులో మద్యం తాగి వాహనాలు నడిపిన 84 మందికి జైలు శిక్ష, ఒక్కొక్కరికీ పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు కోర్టు కానిస్టేబుల్ తెలిపారు. అలాగే తక్కువ మోతాదులో మద్యం తాగి వాహనాలు నడిపిన 1,322 మందికి ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. జరిమానాల రూపంలో ఒక కోటి 37 లక్షల 50 వేల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్టు ఆయన తెలిపారు.
ప్రొఫెసర్ సస్పెన్షన్
తిరుపతి సిటీ: ఎస్వీ వ్యవసాయ కళాశాల క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ వీ.ఉమా మహేష్‌ను సస్పెండ్ చేస్తూ ఎన్జీరంగా వర్సిటీ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. తిరుపతి న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఉద్యోగుల క్రమశిక్షణా నియమనిబంధనల ప్రకారం వర్సిటీ అధికారులు ఆయనపై సస్పెన్స్ వేటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment