ముగ్గురిని కాపాడిన మైరెన్ పోలీసు
వాకాడు: తూపిలిపాళెం బీచ్ వద్ద సముద్రంలో కొట్టుకు పోతున్న ముగ్గురిని మైరెన్ పోలీసు కాపాడి ఒడ్డుకు చేర్చారు.వివరాలు.. బుధవారం నూతన సంవత్సర వేడుకల సందడి తూపిలిపాళెం సాగరతీరంలో కనిపించింది. విహారయాత్రకు వచ్చిన వారు కేరింతలు కొడుతూ సముద్రంలో స్నానం చేస్తున్నారు. అలల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో వాల్మేడుకు చెందిన రౌతు హైమావతి, వంజివాక కీర్తి, రౌతు సుబ్రమణ్యం సముద్రంలోకి కొట్టుకుపోతూ కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన మైరెన్ పోలీసు వారిని రక్షించారు. అప్పటికే హైమావతి అపస్మారక స్థితికి చేరుకుంది. ప్రథమ చికిత్స అనంతరం వారిని వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం నుంచి ముగ్గురిని కాపాడిన మైరెన్ సిబ్బంది శ్రీహరిని సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ శివసౌమ్య అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment