పరిశోధన పత్రికల ఆవిష్కరణ
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీలో నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానవి, గమనం పేరిట రెండు పరిశోధన పత్రికలను వీసీ ఉమ ఆవిష్కరించారు. వీసీ మాట్లాడుతూ బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో నూతన ఏడాదిలో వర్సిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ప్రధానమంత్రి ఉషా పథకంలో భాగంగా సామాజిక శాస్త్రాలకు సంబంధించిన పరిశోధన పత్రాలను ముద్రించేందుకు ప్రొఫెసర్ బీవీన్ సంపాదకురాఇగా జ్ఞానవి పత్రికను ప్రారంభిస్తున్నామని వివరించారు. అలాగే ప్రొఫెసర్ వెంకటకృష్ణ ఎడిటర్‌గా సైన్స్ జర్నల్స్‌ను ప్రచురించేదుకు గమనం పత్రికను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పీఎం ఉషా పథకంలో భాగంగా సుమారు రూ4 కోట్ల విలువైన ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ ఇన్‌స్టిట్యూషనల్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన మంజూరు పత్రాలను అధ్యాపకులకు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రజని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment