గజ వాహనంపై సిరులతల్లి
చంద్రగిరి : తిరుచానూరు శ్రీపద్మావతీదేవి గజవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన ఉత్తరాషాడ సందర్భంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ ముఖమండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో విద్యుత్ కాంతుల నడుమ ఊంజల్ సేవ చేశారు. అనంతరం సిరులతల్లిని గజవాహనంపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు.
ఘర్షణలో ఇద్దరికి గాయాలు
నాయుడుపేటటౌన్:మల్లాం మార్గం వద్ద జాతీయ రహదారి కూడలి సమీపంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఘర్షణపడి గాయాలపాలయ్యా రు. వివరాలు.. విన్నమాలకు చెందిన బత్తిన శ్రీకాంత్ బుధవారం సాయంత్రం మద్యం తాగేందుకు వైన్‌షాపు వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న అదే గ్రామానికి చెందిన కలపాటి మోహన్‌కృష్ణతో వాగ్వాదం తలెత్తింది దీంతో ఇద్దరూ కర్రలను తీసుకుని పరస్పరం దాడులకు దిగారు. ఇద్దరికీ తీ వ్రంగా గాయాలయ్యాయి. ఇరువరి ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాసాశ్రమంలో
భక్తులకు నిరాశ
రేణిగుంట(ఏర్పేడు) : ఏర్పేడు వ్యాసాశ్రమంలోకి భక్తులను సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో వారు నిరాశ వ్యక్తం చేశారు. సద్గురు శ్రీ మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమంలో అధిష్టాన మందిరం, కాశీబుగ్గ తీర్థం వంటి సందర్శనీయ ప్రదేశాలు ఉండడంతో భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా ఆశ్రమానికి పోటెత్తుతుంటారు. అయితే బుధవారం మాత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సైతం ఆశ్రమ గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది నిలిపేశారు. దీంతో మలయాళస్వామి భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఆశ్రమ నిర్వాహకుల వైఖరిపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment