బస్సు కింద పడి యువకుడి మృతి
తిరుపతి క్రైం: నగరంలోని రేణిగుంట రోడ్‌లో బస్సు కిందపడి యువకుడు మృతి చెందిన ఘట న ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అలిపిరి పోలీసుల కథనం.. ఒడిశాకు చెందిన హరీష్ (18) వారి అన్న హరికృష్ణతో కలిసి కాటన్ మిల్ రైల్వే గేట్ వద్ద బస్సును ఓవర్ టేక్ చేయబోయారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన బస్సు వెనుక చక్రం కింద పడి హరీష్ అక్కడికక్కడే మృతి చెందగా.. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న హరికృష్ణ స్వల్ప గాయా లతో ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అలిపిరి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
ఏడు కిలోల గంజాయి స్వాధీనం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిఽధిలో సోమవారం ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రెండో పట్టణ పోలీసుల కథనం.. ప్రభుత్వాస్పత్రి రోడ్డులో ఇద్దరు ఒడిశాకు చెందిన యువకులు గంజాయితో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రెక్కీ నిర్వహించి ఏడు కిలోల గంజాయితో సహా ఒడిశాకు చెందిన బిజయ్(29), సుక్కు(25)ను అరెస్టు చేశారు. ఈ మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment