మైస్ పర్యాటకానికి అవకాశాలు పుష్కలం
రేణిగుంట: ఎంఐసీఈ(మీటింగ్స్, ఇన్‌సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్)తో జిల్లాలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు పుష్కల అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శనివారం ఉదయం ఏపీ టూరిజం అథారిటీ, జిల్లా పర్యాటక కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎంఐసీఈ అభివృద్ధికి ఐఐటీతో ఎంఓయూ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైస్ టూరిజం కాన్ఫరెన్‌న్స్ ఏర్పాటుకు ఐఐటీ డైరెక్టర్ సహకారం మరువలేనిదని, ఈ కాన్ఫరెన్‌న్స్‌లో జిల్లాలో మైస్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, అనుసంధానం వంటి అంశాలపై మేథో మథనం చేసి ప్రణాళికల తయారీకి సలహాలు ఇవ్వాలని కోరారు. జిల్లాలో రోజుకు సుమారు 80 వేల నుంచి లక్ష మంది ప్రజలు వివిధ అవసరాలపై వస్తుంటారని, ప్రముఖంగా తిరుమల శ్రీవా రి దర్శనానికి ఎక్కువగా వస్తుంటారని పర్యాటక రంగం ఇక్కడ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో 75 కి.మీ. సముద్ర తీరం ఉందని, 6 బీచ్‌లున్నాయని, తలకోన, అరై, టీపీ కోన, కై లాసగిరి తదితర వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిపారు. తుంబుర తీర్థం తిరుమల కొండపైన పర్యాటక ప్రదేశం అని అన్నారు. విలక్షణమైన పర్యావరణం కలిగిన పులికాట్ లేక్, పులికాట్ బర్డ్ అభయారణ్యంలో ఫ్లెమింగో పక్షులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉన్న త కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి, ఐజర్, సంస్కృత యూనివర్సిటీలు జిల్లాలోని ఉన్నాయన్నారు. ఐఐటీలో 18 క్లబ్స్ ఏర్పాటుతో ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్ సందర్శనకు, ఎకో టూరిజంలో భాగంగా యూనివర్సిటీ విద్యా ర్థిని, విద్యార్థులు వెళ్లడం జరుగుతోందని తెలిపారు. పుదుచ్చేరి యూనివర్సిటీ టూరి జం శాఖ ప్రొఫెసర్ వై.వెంకట్రావు, ఈవెంట్ మేనేజర్ డీవీ. వినోద్‌గోపాల్, తిరుపతి కమిషనర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా ఫారెస్ట్ అధికారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment