చరిత్ర తెలుసుకో.. భవితను మార్చుకో!
● గూడూరులో రెండు రోజుల పాటు సెమినార్
● ఆంధ్రప్రదేశ్ చరిత్ర సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు
● హాజరైన చరిత్ర, పరిశోధక అధ్యాపకులు
చిల్లకూరు : చరిత్ర అనగానే గుర్తుకొచ్చేది గతం. దీని మీద పలువురు పరిశోధనలు చేస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి.. వాటి విశిష్టత ఏంటి అనే విషయాలను నేటి తరానికి అందిస్తుంటారు. ఇలాంటి ఆలోచనతోనే 47 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ చరిత్ర సమాఖ్య ఏర్పాటైంది. అప్పటి నుంచి నిరాటంకంగా ఇది పనిచేస్తోంది. ఇందులో భారత దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పరిశోధకులు సభ్యులుగా ఉంటున్నారు. ప్రతి ఏడాదీ వారు ఏ అంశంపై పరిశోధన చేశారు.. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని ఏడాదికి ఒక సారి నిర్వహించే సెమినార్‌లో ప్రతులను సమర్పిస్తుంటారు. ఆ తరువాత వాటిని ప్రభుత్వానికి అందించి ముద్రించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గూడూరులోని ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర చొరవతో శని, ఆదివారాలలో సెమినార్ రూపొందించారు. ఇందులో ఆంధ్రతోపాటు తెలంగాణ, అస్సాం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బెంగాల్, మణిపుర్, ఢిల్లీ, పాండిచ్చేరి ప్రాంతాలకు చెందిన మేధావులు, పరిశోధకులు, రచయితలు, సాహితీ వేత్తలు, చరిత్ర విద్యార్థులు 350 మంది వరకు పాల్గొన్నారు. వీరు ఆయా ప్రాంతాల చరిత్రపై చేసిన పరిశోధనలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు చేసిన కృషిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment