క్రీడల్లోనూ రాణించాలి
తిరుపతి సిటీ: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అకడమిక్ విద్యతో పాటు క్రీడారంగంలో రాణించాలని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ జేవీ రమణ పిలుపునిచ్చారు. సోమవారం వర్సిటీ వేదికగా ప్రారంభమైన 13వ వెటర్నరీ అంతర్‌కళాశాలల క్రీడాసాంస్కృతిక పోటీలను ఆయన వర్సిటీ అధికారులతో కలసి జ్యోతిప్రజ్వల చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, ఆరోగ్య సంరక్షణతో పాటు ఉన్నత విద్యకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెటర్నరీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోటీలలో పాల్గొనడం సంతోషకరమన్నారు. తొలి రోజు వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నీకాయిట్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో ప్రొద్దుటూరు, తిరుపతి, గన్నవరం, గరివిడి కళాశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. డీన్లు కే.వీరబ్రహ్మయ్య, కే నాగేశ్వర్‌రావు, వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతిరామయ్య, పీడీ జయచంద్ర, డాక్టర్ రాంబాబు నాయక్, మురళీధర్, డాక్టర్ చైతన్య, స్రవంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment