తిరుపతి అర్బన్: కూటమి నేతల మాటలతో సామాన్య ప్రజలు మురిసిపోయారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రతి అర్జీకి పరిష్కారం చూపిస్తామంటే ఔనే..అనుకుని క్యూకట్టారు. కానీ పేరుకే సదస్సులు.. పరిష్కారం లేదని తెలుసుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 6 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మొత్తం 15,692 అర్జీలు రాగా.. అందులో 11,251 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. మిగిలిన 4,441 అర్జీలు వివిధ సమస్యలపై రాగా.. వాటిని తూతూమంత్రంగా పరిష్కరించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల జోలికి వెళ్లలేదు.
శెట్టిపల్లె సమస్య అంతేనా?
గత ఏడాది డిసెంబర్ 30న తిరుపతి శెట్టిపల్లిలో రెవెన్యూ సదస్సును చేపట్టారు. ఇందులో మొత్తం 1,410 మంది ఇంటిపట్టాల సమస్యను, 248 మంది భూ సమస్యలను ఈనెల 5వ తేదీ నాటికి 30 శాతం, 16వ తేదీనాటికి నాటికి మరో 30 శాతం, 30వ తేదీనాటికి మిగిలిన 40శాతం పూర్తి చేస్తామని మాటిచ్చారు. అయితే ఇప్పటి వరకు ఒక శాతం సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇలాంటి సమస్యలు శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి, సత్యవేడు నియోజకవర్గాల్లోనూ కోకొల్లలుగా ఉన్నాయి.
న్యాయం చేయాలంటూ తిరుపతి మంగళం రెవెన్యూ సదస్సులో స్థానికుల నిరసన (ఫైల్)
రెవెన్యూ వచ్చిన పరిష్కరించినవి
డివిజన్ అర్జీలు (శాతం)
సూళ్లూరుపేట 3,080 15
గూడూరు 5,990 18
శ్రీకాళహస్తి 1,570 16
తిరుపతి 5,052 25
Comments
Please login to add a commentAdd a comment