ఫలితం లేదయ్యా
నా పేరు గుమ్మడి వీరాస్వామి. కలిచేడు గ్రామం, వెంకటగిరి నియోజకవర్గం. నా పొలాన్ని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయలేదు. నాతో పాటు గ్రామంలోని అందరి రైతుల పొలాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు లేవు. గ్రామంలో ఉన్న 1,800 ఎకరాల భూములకు పాసుపుస్తకాలు అందలేదు. మేమంతా కలిసి ఈ విషయమే ఈ నెల 4వ తేదీన మా గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు దృష్టికి తీసుకెళ్లాం. అధికారులకు వినతిపత్రం సమర్పించాం. అయినా ప్రయోజనం లేదు.
భూములునా పట్టాల్లేవ్
మాది చిల్లకూరు మండలం, తిక్కవరం గ్రామం. నా పేరు ఇసనాక జయశేఖరరెడ్డి. మా నానమ్మ పోలమ్మ పేరుతో తిక్కవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నం.831, 832లో సుమారు మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నా పేరుమీద మార్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పెట్టిన రెవెన్యూ సదస్సుకు వెళ్లా. మా నానమ్మ పేరుతో ఉన్న భూమికి సంబంధించిన రికార్డులన్నీ అధికారులకు చూపించా. ఒక వారంలోగా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇంకా పరిష్కరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment