అప్రకటిత పాలకమండలి ఇష్టారాజ్యం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అప్రకటిత పాలకమండలి రాజ్యమేలుతోంది. పాలనా పరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఆలయాన్ని తమ కన్నుసన్నలో నడిచేవిధంగా మార్చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పాలకమండలి ఏర్పాటు చేయకముందే ఓ కార్యకర్త జులం ప్రదర్శిస్తున్నాడని పచ్చమీడియా పిచ్చిరాతలు రాసింది. అప్పట్లో ఏదో జరిగిపోతోందంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అయితే గత ఆరు నెలలుగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఓ ఐదుగురు వ్యక్తులు ఎమ్మెల్యే ముఖ్య అనుచరులమంటూ అప్రకటిత పాలకమండలిలా వ్యవహరిస్తున్నారు. అన్నదానం, గోశాల, మండపాల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. టెండర్లు తదితర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. పాలకమండలి చైర్మన్‌గా ఎమ్మె ల్యే నిర్ణయించిన ఓ నాయకునికి వ్యతిరేకంగా ఎస్సీవీ నాయుడు వర్గం మరో అభ్యర్థిని పోటీకి దించింది. దీన్ని ఆసరాగా చేసుకుని అప్రకటిత పాలకమండలి ఆలయంలో అధికారం చెలాయిస్తోంది. దీనిపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment