రూ.వంద కోట్లతో పూడిక తీత
సూళ్లూరుపేట : పులికాట్ సరస్సును సంరక్షించుకుని తద్వారా విదేశీ వలస విహంగాలను మన చుట్టాలుగా భావించి కాపాడుకునేందుకు, అలాగే మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించేందుకు వంద కోట్ల రూపాయలతో పూడి రాయదొరువు ముఖద్వారాన్ని పూడికి తీయించేందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారని జిల్లా ఇన్‌చార్జి మంతి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండాల కేంద్రాలుగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్–2025 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముందుగా మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టూరిజం ప్రధాన ఆదాయ వనరుగా చేయాలనే సంకల్పం ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కొండయ్య, ప్రముఖ వ్యాపారవేత్త కొండేపాటి గంగాప్రసాద్, శ్రీసిటీ అధినేత రవీంద్ర సన్నారెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పరసా వెంకటరత్నయ్య, నెలవల సుబ్రమణ్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment