విశ్రాంతి భవనాల పునర్నిర్మాణానికి కార్యాచరణ
తిరుమల: తిరుమలలో కాలం చెల్లిన విశ్రాంతి గృహాల స్థానంలో కొత్త భవనాల నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో శుక్రవారం అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్యచౌదరితో కలిసి సుదర్శన్, గోవర్ధన్, కళ్యాణి, సి–టైప్ క్వార్టర్లు, పద్మావతి ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలను పరిశీలించారు. సాధారణ భక్తుల సౌకర్యార్థం సదరు ప్రదేశాలలో విశ్రాంతి గృహాలను పునర్నిర్మించడానికి నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని సీఈ సత్యనారాయణను ఆదేశించారు.
గుర్తించిన సమస్యలివే
విశ్రాంతి గృహాలన్నీ 6వ దశాబ్దాల క్రితం నిర్మించడంతో వర్షాకాలంలో లీకేజీలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. సరైన పార్కింగ్ సదుపాయాలు, విశాల స్థలం లేదు. భవన నిర్మాణాలు పాత పద్ధతిలో నిర్మించడంతో భవనాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. పాత భవనాలలో లీకేజీలు, అపరిశుభ్రత, పార్కింగ్ తదితర అంశాలపై భక్తుల నుంచి టీటీడీకి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవనాలను పనర్నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. డిప్యూటీ ఈఓలు భాస్కర్, హరీంద్రనాథ్, ఈఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment