ఎమ్మెల్యేను కలిసిన డీఎస్పీ
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కలిశారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఎస్పీతో పాటు పట్టణ సీఐ సంతోష్, కరన్‌కోట్ ఎస్సై విఠల్‌రెడ్డిలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే పోలీసు అధికారులకు సూచించారు. కరన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ అయిన వెంటనే స్పందించి చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చ డం పట్ల పోలీసు అధికారులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment