పోస్టులు 3 ఒక్కరూ లేరు !
ముఖ్యమంత్రి ఇలాఖాలో సీడీపీఓల కరువు
వికారాబాద్: సీఎం లాంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారి నియోజకవర్గాల్లో పాలన గాడి తప్పకుండా ఉండేందుకు సమర్థవంతమైన అధికారులనునియమించుకోవడం సహజం. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పాలన గాడితప్పి ప్రభుత్వం విమర్శలపాలవుతోంది. ఇటీవల అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారినా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడంలేదు. విద్యాశాఖ పరంగా సీఎం ఇలాఖాలో వందలాది పోస్టులు ఖాళీగా ఉండటంతో చదువు కునారిళ్లుతోంది.. పీహెచ్‌సీల్లో వైద్యుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదంతా ఒకెత్తయితే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మరీ అధ్వానంగా మారింది. కొడంగల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 234 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మూడు సీడీపీఓ పోస్టులు ఉండగా అన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో సీనియర్ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించారు. కార్యాలయంలో రికార్డులు రాసే సీనియర్ అసిస్టెంట్‌కు సీడీపీఓగా బాధ్యతలు ఇవ్వటంపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కానీ ఫలితం కనిపించడం లేదు.
ఆరు నెలలుగా ఇదే పరిస్థితి
రాష్ట్రంలో 150 పైచిలుకు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా కేవలం రెండు చోట్ల మాత్రమే ప్రాజెక్టుకు మూడు చొప్పున సీడీపీఓ పోస్టులు ఉన్నాయి. అందులో కొడంగల్ ఒకటి. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు (వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మర్పల్లి) ఉండగా.. వీటి పరిధిలో 1,107 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ సెంటర్ల పరిధిలో సగటున 60 వేల పైచిలుకు చిన్నారులు, 6,100మంది గర్భిణులు, 5,900మంది బాలింతలు ఉన్నారు. నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు నలుగురు రెగ్యూలర్ సీడీపీఓలు ఉన్నారు. కానీ మూడు సీడీపీఓలు ఉన్న సీఎం సొంత నియోజకవర్గంలో ఒక్కరుకూడా లేకపోవడం గమనార్హం. దీంతో కార్యాలయంలో విధులు నిర్వహించే సీనియర్ అసిస్టెంట్‌కు (ఎఫ్‌ఎస్‌సీ) బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. గతంలో ఈ విషయంపై స్థానికులు కడా ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ స్పందించి సీడీపీఓలను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
అంతా మాజీ కనుసన్నల్లోనే..
గతంలో కొడంగల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓగా పని చేసిన వ్యక్తి ఇన్ఫిలెన్స్ చేసి అక్కడికి కొత్తవారు రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తిపై అనేక ఆరోపణలు రావడంతో లోకాయుక్తలో ఫి ర్యాదు చేశారు. అప్పట్లో ఉన్నతాధికారులు స్పందించి ఆయన్ను గుట్టుగా బదిలీ చేశారు. తిరిగి ఇక్కడికే రావాలనే ఉద్దేశంతోనే ఆయన కొత్తవారు రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాను తిరిగి వచ్చేదాకా సీనియర్ అసిస్టెంట్‌కు ఇన్‌చార్జ్ సీడీపీఓగా బాధ్యతలు ఇప్పించేలా ఇన్ఫిలెన్స్ చేశారని సమాచారం. సాధారణంగా సీడీపీఓ పోస్టు ఖాళీగా ఉంటే పక్క నియోజకవర్గానికి చెందిన ప్రాజెక్టు సీడీపీఓలకు అదనపు బాధ్యతలు అప్పగించాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా సీనియర్ అసిస్టెంట్‌కు ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. మూడు పోస్టులు ఉన్న కొడంగల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఒక్క సీడీపీఓ కూడా విధుల్లో చేరకపోవడం గమనార్హం.
కొడంగల్ ఐసీడీఎస్‌లో ఇదీ పరిస్థితి
ప్రాజెక్టు పరిధిలో 234 అంగన్‌వాడీ కేంద్రాలు
సీనియర్ అసిస్టెంట్‌కుసీడీపీఓ బాధ్యతలు
గాలిలో దీపంలా పర్యవేక్షణ
Comments
Please login to add a commentAdd a comment