నెత్తురోడుతున్న రహదారి
ప్రాణాలు హరి
● హైదారాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు ● అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం ● నివారణ చర్యలు చేపట్టని అధికార యంత్రాంగం
పరిగి: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదరా రి రక్తసిక్తమవుతోంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది. వాహనదారులనుంచి లక్షల రూపాయల్లో ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నా భద్రత మాత్రం అంతంతమాత్రమే. రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
అధికారుల తీరుపై విమర్శలు
రెండు వరుసలతో ఎన్‌హెచ్–163 రోడ్డు నిర్మించినప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదు. మన్నెగూడ నుంచి తుంకిమెట్ల వరకు నిత్యం ఏదో ఓ చోట యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. రోడ్డు భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. రవాణా శాఖ అధికారులు ట్యాక్స్‌ల వసూలుపై పట్టిన శ్రద్ధ ప్రమాదాల నియంత్రణపై చూపడం లేదనే అపవాదులున్నాయి. ప్రమాదాలపై స్థానిక పోలీసులు, రోడ్డు రవాణా అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, రాత్రి వేళలో వెళుతురు ఉండేలా చూడడం, యూటర్న్‌లు, మార్కింగ్‌లు, నిరంతరంరోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. యాక్సిడెంట్ స్పాట్స్ వద్ద ప్రత్యేక చర్యలు, ఏమైన రోడ్డు నిర్మాణ లోపాలు జరిగాయా, డివైడర్లు ఏర్పాటు తదితర వాటిని పరిశీలించాలి. ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలాంటి సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలనే విషయాలను పోలీసు అధికారులు, ఆర్డీఏ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని. రోడ్డు ప్రమదాల నివారణకు ప్రభుత్వం సైతం రోడ్డు భద్రతా నిధులు విడుదల చేస్తూనే ఉ న్నా.. నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారు లు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రాణాలు కోల్పోతున్న ప్రయాణికులు
పరిగి మండల పరిధిలోని ఇటీవల రోడ్డు ప్రమదా లు పెరిగాయి. ఈ యాక్సిడెంట్స్‌లో ఒక్కరిద్దరి ప్రాణాలు సైతం కోల్పోతూనే ఉన్నారు. పూడూర్ మండలం మన్నెగూడ నుంచి బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం వరకు ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పోలీసులు, సంబంఽధిత అధికారులు నిమ్మకు నిరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
యాక్సిడెంట్ స్పాట్
మండలం గ్రామాలు
పరిగి హన్మన్‌గండి, గడిసింగాపూర్,
రంగంపల్లి, సాలిపూలబాట తండా
బొంరాస్‌పేట రేగడిమైలారం, తుంకిమెట్ల
చర్యలు తీసుకుంటాం
రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పరిమితికి మించి వేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నియంత్రణ చర్యలు తీసుకుంటాం.
– సంతోష్‌కుమార్, ఎస్‌ఐ, పరిగి
Comments
Please login to add a commentAdd a comment