ముగిసిన ఓరియంటేషన్ తరగతులు
అనంతగిరి: వికారాబాద్ కోర్టు ఆవరణలో రెండు రోజులుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్ వలంటీర్లు, న్యాయ విద్యార్థులకు, న్యాయసేవా ప్యానల్ న్యాయవాదులకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ బాల్యవివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలు, సీనియర్ సిటిజన్ యాక్టు, ప్రిలిటేగేషన్ కేసులు, కళాశాలల్లో జరుగుతున్న ర్యాగింగ్, జువెలిన్ యాక్టు, పిల్లల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఒకవేళ చిన్న పిల్లలు నేరాలు చేసినట్లయితే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశంపై శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి శృతిదూత, చీఫ్ లీగలేర్ న్యాయవాది వెంకటేష్, డిప్యూటి లీగలేర్ న్యాయవాది రాము, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్, న్యాయవాదులు శంకరయ్య, నరేందర్ యాదవ్, శ్రీశైలం, యాదగిరి, సుధాకర్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment