దొండపర్తి: యువతి ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన యువకుడిని సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి ఒక యువతి ఫొటోను సోషల్ మీడియాలో యువకుడు సేకరించి పిక్స్ ఆర్ట్ అనే మొబైల్ యాప్‌లో మార్ఫింగ్ చేశాడు. ఆ ఫొటోను సదరు యువతి వాట్సాప్ నెంబర్‌కు పంపించాడు.
తనకు డబ్బులు ఇవ్వకపోతే పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో సదరు యువతి వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ భవానీ ప్రసాద్ దర్యాప్తు చేపట్టి సాంకేతికత సహాయంతో మార్ఫింగ్ ఫొటోలు పంపించింది కంచరపాలెం బర్మాక్యాంప్‌కు చెందిన బొడ్డేటి డిల్లేష్(19)గా గుర్తించారు. దీంతో అక్కడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment