మాట్లాడుతున్న విశాఖ క్వీన్ విజేత దివ్య మచ్చా
సీతంపేట: ఫ్యాషన్ రంగంపై ఉన్న ఇష్టం, కుటుంబ సభ్యుల సహకారంతో మిస్ అండ్ మిసెస్ విశాఖ క్వీన్ పోటీలో విజేతగా నిలిచానని దివ్య మచ్చా అన్నారు. క్వీన్ ఈవెంట్స్ పోటీలో విజేతగా నిలిచి ట్రోఫీని సాధించిన నేపథ్యంలో మంగళవారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది మహిళలు ఫ్యాషన్ రంగంలోకి రావాలంటే భయపడుతున్నారన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కెరీర్‌పై ఇష్టంతో ఈ పోటీల్లో పాల్గొన్నానని.. తన ప్రతిభను గుర్తించి విజేతగా ఎంపిక చేశారన్నారు. మహిళలు, యువతుల్లో టాలెంట్ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం లేక ప్రతిభ చూపలేక పోతున్నారన్నారు. క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి మాట్లాడుతూ విశాఖలో చాలా మంది టాలెంట్ మహిళలు ఉన్నారని, వారిని ఫ్యాషన్ రంగానికి పరిచయం చేయాలని ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment