ఉక్కు సంకల్పమంటూ ఉత్తుత్తి మాటలు | - | Sakshi
Sakshi News home page

ఉక్కు సంకల్పమంటూ ఉత్తుత్తి మాటలు

Published Fri, Sep 20 2024 2:42 AM | Last Updated on Fri, Sep 20 2024 2:42 AM

ఉక్కు

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌.. ఇతర కూటమి నేతలు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రగల్భాలెన్నో పలికారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగాలంటే.. ముందు మమ్మల్ని దాటి వెళ్లాలంటూ పవన్‌ కల్యాణ్‌ బీరాలు పలికారు. అవసరమైతే కార్మిక నేతలతో కలిసి ఢిల్లీ వెళ్తానంటూ గొప్పలు చెప్పారు.

కానీ.. ప్రైవేటీకరణ కాకుండా గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్లాంట్‌ను కాపాడింది. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజులకే కూటమి ప్రభుత్వం.. ప్లాంట్‌ను అప్పనంగా అప్పగించేందుకు పావులు కదుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తే స్టీల్‌ప్లాంట్‌ ఉత్పిత్తి పెరుగుతుంది. కానీ అధికారం చేపట్టి మూడు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే ఉక్కు పరిరక్షణ కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు నెల రోజులుగా చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అవకాశం కల్పించడం లేదు. కేంద్రంతో లాలూచీ పడి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కూడా సహకరిస్తోందనే అనుమానాలు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో బలపడుతున్నాయి.

ఇలా.. ఏ ఒక్క హామీ గురించి ప్రస్తావన సైతం తీసుకురాకుండా.. వంద రోజుల పాలనను మమా అనిపించేశారు. గత ఐదేళ్ల కాలంలో వెలుగొందిన విశాఖపట్నం జిల్లాను.. అడుగడుగునా దగా చేస్తూ పాలన సాగిస్తున్న కూటమి నేతల శైలిపై ప్రజలు మండిపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఉక్కు సంకల్పమంటూ  ఉత్తుత్తి మాటలు 
1
1/1

ఉక్కు సంకల్పమంటూ ఉత్తుత్తి మాటలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement