సముద్రంలోకి వ్యర్థాలు | - | Sakshi
Sakshi News home page

సముద్రంలోకి వ్యర్థాలు

Published Sat, Sep 21 2024 2:18 AM | Last Updated on Sat, Sep 21 2024 2:18 AM

 సముద్రంలోకి వ్యర్థాలు

ముద్రంలోకి దూసుకెళ్లి మరీ భారీ బండరాళ్లతో కప్పేసి... స్థలాన్ని ఆక్రమిస్తున్న హేచరీల యాజమాన్యాలు సముద్ర జలాలను సైతం కలుషితం చేస్తున్నాయనే విమర్శలున్నాయి. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా సముద్రంలోకి ఈ హేచరీల నుంచి వచ్చే వ్యర్థాల ను వదిలేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు నెల నెలా మామూళ్లు ముట్టచెబుతూ.. అటువైపు కన్నెత్తి చూడకుండా చూసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ వ్యర్థాలతో సముద్ర మత్స్యసంపదకు నష్టం వాటిల్లుతోందని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు. మరోవైపు తమ చేపల వేటకు ఈ వ్యర్థాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలతో మత్స్యసంపద దెబ్బతింటుండటంతో వేట కోసం మరింత దూరం సముద్రంలోకి వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement