అంతస్తులపై అక్రమ అంతస్తులు | - | Sakshi
Sakshi News home page

అంతస్తులపై అక్రమ అంతస్తులు

Published Sat, Sep 21 2024 2:18 AM | Last Updated on Sat, Sep 21 2024 2:18 AM

అంతస్

అనుమతులు ఓ చోట.. నిర్మాణం మరో చోట

జీవీఎంసీ 12వ వార్డు పరిధి సాలిపేటలో ఓ టీడీపీ నాయకుడు రెవెన్యూ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నాడు. ఇది కొండవాలు ప్రాంతం. ఇక్కడ గతంలో సుమారు 190 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు ఇళ్లు ఉండేవి. వాటి వెనుక రెవెన్యూ స్థలం(కొండవాలు) ఉంది. ఇప్పుడు ఆ రెండు ఇళ్ల స్థలంతో పాటు వెనుక ఉన్న రెవెన్యూకి చెందిన సుమారు 100 గజాల కొండవాలును కలుపుకుని నిర్మాణం చేపట్టేశాడు. ఈ బిల్డర్‌ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేరు చెబుతుండటంతో.. రూరల్‌ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా వేరే ప్రాంతంలో సర్వే నంబర్‌తో ఈ భవన నిర్మాణం కోసం జీవీఎంసీ నుంచి ప్లాన్‌ తీసుకోవడం గమనించదగ్గ విషయం. ఈ కొండవాలు సర్వే నంబర్‌ 24లో ఉంది. కానీ ఈ భవన నిర్మాణానికి మాత్రం సర్వే నంబర్‌ 67/3పై ప్లాన్‌ తీసుకున్నాడు.

ఆరిలోవ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ఎవరికై నా మంచి జరిగిందా అంటే అది కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే.! బడికి వెళ్లే పిల్లల దగ్గర నుంచి తల్లులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించి.. సూపర్‌సిక్స్‌ను అటకెక్కించింది. ప్రజలను నిలువునా దగా చేసింది. కాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు అక్రమాలకు తెరతీశారు. ఈ విషయంలో ఆరిలోవ ప్రాంతం టీడీపీ నాయకులు ఇంకా ముందున్నారు. కొందరు గెడ్డలు, ఖాళీ స్థలాలు ఆక్రమిస్తుంటే.. మరికొందరు అక్రమ నిర్మాణాలతో దూసుకుపోతున్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేరు చెప్పి జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను బెదిరిస్తూ.. తమ పని కానిచ్చేస్తున్నారు. టీడీపీ నేతల అక్రమ నిర్మాణాలపై అధికా రులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కార్పొరేటర్‌ భర్త దందా

జీవీఎంసీ 10వ వార్డులో టీడీపీ కార్పొరేటర్‌ భర్త అక్రమ నిర్మాణానికి తెరతీశాడు. ఆదర్శనగర్‌ కొండవాలులో సమారు 250 చదరపు గజాల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపడుతున్నాడు. ఇది కొండవాలు కావడంతో భారీ భవంతులు నిర్మించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. అయినా ఇక్కడ దర్జాగా నాలుగో ఫ్లోర్‌ వేస్తున్నాడు. మరో అంతస్తు వేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇంత పెద్ద భవన నిర్మాణం చేపట్టడానికి కనీసం 30 అడుగులు వెడల్పు రోడ్డు ఉండాలి. ఇక్కడ ఉన్నది 10 అడుగులు రోడ్డు మాత్రమే. దీంతో పాటు ఎలాంటి సెట్‌ బ్యాక్‌లు లేకుండా నిర్మాణం సాగించేస్తున్నాడు. ఇది అక్రమ నిర్మాణమని తెలిసినా జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

100 రోజుల పాలనలో అక్రమాలకు

తెరతీసిన టీడీపీ నేతలు

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు

ఎమ్మెల్యే పేరు చెప్పి అధికారులకు బెదిరింపులు

No comments yet. Be the first to comment!
Add a comment
అంతస్తులపై అక్రమ అంతస్తులు 1
1/1

అంతస్తులపై అక్రమ అంతస్తులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement