అవకాశాలను అందిపుచ్చుకోవాలి
నెల్లిమర్ల రూరల్: అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని నయంత విశ్వ విద్యాలయం సీఈవో ప్రొఫెసర్ రంజన్ బెనర్జీ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో వర్సిటీ 4వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రంజన్ బెనర్జీ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా కృషి చేసినప్పుడే గొప్ప విజయాలు సొంతమవుతాయన్నారు. ఉన్నత స్థాయికి వెళుతూనే ఇతరులకు చేయూతనివ్వాలన్నారు. ఇతరుల జీవితాల్లో చిరునవ్వులు చూడగలిగినప్పుడే మంచి విజయాలు సాధించినవారమవుతామన్నారు. సెంచూరియన్ వర్సిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ముక్తికాంత మిశ్రా, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్‌రావు విద్యార్థులు సాధించిన విజయాలను ప్రశంసించారు. వర్సిటీ చాన్సలర్ జీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఏడేళ్ల వ్యవధిలోనే దేశంలో అగ్రశ్రేణి విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా సెంచూరియన్ అవతరించిందన్నారు. వైస్ చాన్సలర్ ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ వర్సిటీను వ్యాపారం కోసం స్థాపించబడలేదని, శక్తివంతమైన విద్యార్థులను సమాజానికి అందించేందుకు నిరంతర కృషి చేస్తున్నామన్నారు. అనంతరం 201 మంది విద్యార్థులకు డిగ్రీలు, మరో ఐదుగురు విద్యార్థులకు పీహెచ్‌డీలు, 16 మందికి బంగారు పతకాలు, 8 మందికి నగదు ప్రొత్సాహకాలను వక్తలు అందజేశారు. కార్యక్రమంలో భువనేశ్వర్ వర్సిటీ వీసీ సుప్రియా పట్నాయక్, రిజిస్ట్రార్ పల్లవి, పాలకమండలి సభ్యుడు, పారిశ్రామికవేత్త కుమార్ రాజా, డాక్టర్ పి.ఎస్.ఠాగూర్, ప్రొఫెసర్ కె.సి.బి.రావు, పీఎన్‌ఎస్‌వీ నరసింహం, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
నయంత యూనివర్సిటీ సీఈఓ రంజన్ బెనర్జీ
సెంచూరియన్‌లో ఘనంగా స్నాతకోత్సవం
Comments
Please login to add a commentAdd a comment