బుల్లయ్య విద్యార్థులకు అంతర్జాతీయ గుర్తింపు
సీతంపేట: డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల లైఫ్ సైన్స్ విద్యార్థుల పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బీఎస్సీ లైఫ్ సైన్స్(బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) ఆఖరి సంవత్సరం చదువుతున్న టి.హర్షిత, ఎ.తేజాంబిక్, జె.కార్తికేయ, ఎం.అశ్విని ఎన్విరాన్‌మెంటల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.మాధవి, జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.శైలజ మార్గదర్శకత్వంలో ‘విశాఖపట్నం సముద్ర తీరంలో సముద్రపు గడ్డి, పచ్చిక భూములను పునరుద్ధరించే బ్లూ కార్బన్ ఎకో సిస్టం పయనీరింగ్’అనే అంశంపై పరిశోధన చేశారు. స్టూడెంట్ సొసైటీ ఫర్ కై ్లమేట్ చేంజ్ అవేర్‌నెస్(ఎస్‌ఎస్‌సీసీఏ), సీడ్స్ ఆఫ్ పీస్(యూఎస్‌ఏ) సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పోటీలో ఈ పరిశోధనను ఎంపిక చేశాయి. తదుపరి అధ్యయనాల కోసం విద్యార్థులు 2025 ఫిబ్రవరిలో 10 రోజుల ఫెలోషిప్ ప్రోగ్రాంకు అమెరికా వెళ్లనున్నారు. ఒడిశా రాష్ట్రంలోని చిలికా సరస్సు నుంచి హలోఫిలా ఓవాలిస్, హలోడ్యూల్ ఫినిఫోలియా అనే రెండు రకాల సముద్రపు గడ్డి జాతులను ఎంపిక చేసి, వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించారు. తర్వాత ప్రయోగశాలలోనే సాగు చేశారు. సాగు చేసిన గడ్డి జాతులను నగరంలోని సముద్ర తీర ప్రాంతంలో తిరిగి నాటారు. దీంతో పరిశోధనలో తొలి దశ పూర్తి అయిందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వాతావరణంలోని కార్బన్ డయాకై ్సడ్‌ను ఈ గడ్డి జాతులు పీల్చుకుని గ్లోబల్ వార్మింగ్(వేడిని) తగ్గించడంలో సహాయపడటం ఈ పరిశోధన ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు జట్లలో ఒకటిగా బుల్లయ్య విద్యార్థులు నిలవడం కళాశాలకు గర్వకారణమని కళాశాల కరస్పాండెంట్ జి.మధుకుమార్ అన్నారు. డిగ్రీ ప్రిన్సిపాల్ జీఎస్‌కే చక్రవర్తి, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment