వేచి చూసి.. నిరాశతో వెనుదిరిగి.. | - | Sakshi
Sakshi News home page

వేచి చూసి.. నిరాశతో వెనుదిరిగి..

Published Sun, Dec 22 2024 12:54 AM | Last Updated on Sun, Dec 22 2024 12:54 AM

వేచి చూసి.. నిరాశతో వెనుదిరిగి..

వేచి చూసి.. నిరాశతో వెనుదిరిగి..

సింహాచలం: పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ని కలిసేందుకు అడవివరంలోని పాత గోశాల వద్ద వేచి ఉన్న సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం, జనసేన నాయకులకు నిరాశ ఎదురైంది. శనివారం ఉదయం నగరం నుంచి అడవివరం మీదుగా పెందుర్తి వైపు పవన్‌ కల్యాణ్‌ వెళ్తున్నారని తెలిసి.. భూ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వీరంతా అడవివరం పాతగోశాల వద్దకు చేరుకున్నారు. వర్షం పడుతున్నా పవన్‌ కోసం గొడుగులు వేసుకుని మరీ ఆయన రాక కోసం వేచి చూశారు. ఫ్లకార్డులు పట్టుకుని తమ సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. తీరా పవన్‌ కల్యాణ్‌ గోశాలకు చేరుకోవడం, కారు నుంచే అభివాదం చేసుకుని వెళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో జన సైనికులు, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం నాయకులు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement