విశాఖ సిటీ: వీఎంఆర్‌డీఏకు సంబంధించిన వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలను లీజుకు తీసుకున్న వారు కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా ఆక్రమిస్తే చర్యలు తప్పవని వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ ప్రణవ్‌గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కై లాసగిరి రోప్ వే ఎదురుగా ఉన్న రాక్‌పార్క్‌లో సంస్థ కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆ దుకాణాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. వ్యాపారులకు కేటాయించిన స్థలంలోనే కార్యకలాపాలు నిర్వహించుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment