డాబాగార్డెన్స్: జీవీఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ నియమించేందుకు న్యాయవాదుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. 8 మంది న్యాయవాదుల నియామకం కోసం నోటిఫికేషన్ స్థానిక బార్ కౌన్సిల్ నందు ప్రకటించామన్నారు. ఓపెన్ కేటగిరీ (ఓసీ జనరల్)–4, బీసీ–ఏ–1, బీసీ–బీ–1, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ 1, ఎస్టీ 1 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు కోరుతున్నట్టు చెప్పారు. న్యాయవాదులు బార్ కౌన్సిల్లో కనీసం పదేళ్ల సభ్యుడిగా రిజిస్ట్రేషన్ కల్గి ఉండిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని, చివరి తేదీ జనవరి 6, 2025గా నిర్ణయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment