నేవీ షో
వావ్..
● కడలిపై కదన విన్యాసం
● జనసంద్రమైన సాగర తీరం
నేవీ విన్యాసాలు అబ్బురపరిచాయి. వీకెండ్ కావడంతో ఆదివారం పర్యాటకులు భారీగా తరలిరాగా..విన్యాసాలు వీక్షించి మధురానుభూతి పొందారు. సాగ రతీరం యుద్ధవాతావరణాన్ని తలపించింది. నేవీ విన్యాసాల రిహార్సల్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నౌకాదళ విన్యాసాలలో సాగర తీరం సంభ్రమాశ్చర్యాలకు కేంద్రంగా మారింది. నేవీ సాహసికులు ప్రదర్శించిన పలు విన్యాసాలు సందర్శకులకు కనువిందు చేశాయి. ప్రతి విన్యాసం అబ్బురపరిచింది. నింగి, నేలా తేడాలేదనేలా సాగిన ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించిన ప్రజలు సరికొత్త అనుభూతిని పొందారు. యుద్ధ ట్యాంకర్లతో శత్రుసేనపై విరుచుకుపడిన విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. గగన తలంపై భారత జాతీయ పతాకం, నావికాదళ పతాకాలను ఎగరేస్తూ హెలికాప్టర్ల ఆగమనంతో కార్యక్రమం ప్రారంభమైంది. సముద్రంలోనుంచి తీరానికి చేరుకోవడం, హెలికాప్టర్ల నుంచి సముద్రంలోనికి తాడు సాయంతో దిగడం, శత్రువులపై దాడి చేసి బందీలను విడిపించడం వంటి సన్నివేశాలు అబ్బురపరిచాయి. క్రమపద్ధతిలో చేతక్ హెలికాప్టర్లు, అడ్వాన్స్‌డ్ లైట్ హెలీకాప్టర్లు, హాక్స్ విమానాలు, డార్నియర్ హె లికాప్టర్, సీటింగ్ హెలికాప్టర్, యుద్ధవిమానాలు వ్యూహాత్మకంగా చేసిన విన్యాసాలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. నౌకలపై ప్రత్యేకమైన మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులు చిన్నారులను మైమరిపింపజేశాయి. నావికాదళంలో పనిచేసే సిబ్బంది జీవనాన్ని, విధులను వివరించే విధంగా సీ క్యాడెట్ కార్ ్ప్స సంగీతానికి అనుగుణంగా నర్తించిన విధానం ఆహూతులను అలరించింది.
– ఏయూక్యాంపస్,
ఫొటోలు :
సాక్షి ఫొటోగ్రాఫర్,
విశాఖపట్నం
యుద్ధ ట్యాంకర్స్
Comments
Please login to add a commentAdd a comment