‘ఖైదీలు జైలు నిబంధనలు పాటించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఖైదీలు జైలు నిబంధనలు పాటించాలి’

Published Mon, Dec 30 2024 12:55 AM | Last Updated on Mon, Dec 30 2024 12:55 AM

‘ఖైదీలు జైలు నిబంధనలు పాటించాలి’

‘ఖైదీలు జైలు నిబంధనలు పాటించాలి’

ఆరిలోవ: జైలు నిబంధనలను ఖైదీలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా సెషన్స్‌ జడ్జి ఆలపాటి గిరిధర్‌ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆదివారం జిల్లా న్యాయమూర్తితో పాటు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సందర్శించారు. జైల్లో శనివారం జరిగిన వార్డర్ల ఆందోళనపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి, సీపీ మాట్లాడుతూ జైలు లోపలకి గంజాయి, మొబైల్‌ ఫోన్‌లు, బీడీలు తదితర నిషేధిత వస్తువులు తీసుకురావడం, వినియోగించడం చేయకూడదన్నారు. వీటిని కలిగి ఉన్నవారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రౌడీ షీట్లు ఉన్న ఖైదీలు మంచి ప్రవర్తనపై విడుదలవ్వాలని సూచించారు. అలాంటివారికి నైపుణ్యం ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్‌ రవికిరణ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ–ములాఖత్‌, ఫిజికల్‌ ఇంటర్వ్యూలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి ఎం.మహేష్‌బాబు, డీఎస్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement