● ఎంపీ శ్రీభరత్ ఆశ్చర్యం ● కంగుతిన్న ప్లాంట్ నేతలు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్న విషయం తెలిసి ఎంపీ శ్రీభరత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంపీ సమాధానానికి స్టీల్‌ప్లాంట్ నాయకులు నివ్వెరపోయారు. జీతాలు చెల్లించని విషయం ఎంపీ దృష్టికి పలుమార్లు స్టీల్‌ప్లాంట్ నాయకులు తీసుకువెళ్లినప్పటికీ పై విధంగా మాట్లాడడంతో ప్లాంట్ నేతలు కంగుతిన్నారు. అక్టోబర్‌లో 50 శాతం, నవంబర్‌లో 35 శాతం బకాయి పెట్టగా ఈ నెల ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కొంత శాతం జీతం అయినా ఇవ్వాలి కదా..లేకపోతే ఉద్యోగులు ఇబ్బంది పడతారు కదా అంటూ ఎంపీ మాట్లాడారు. ఈ విషయంపై ఉక్కు మంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. జీతాలపై ఉక్కు మంత్రితో మాట్లాడి తదుపరి ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment