మహారాణిపేట: రాష్ట్ర మానవ వనరుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం విశాఖ వస్తున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుంటారు. ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాంనగర్‌లోని నగర టీడీపీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment