పంటను రక్షించుకునేందుకు వినూత్న పద్ధతి
భీమిలి మండలం మూలకుద్దు పంచాయతీకి చెందిన ఓ రైతు తన పంటను రక్షించుకునేందుకు వినూత్న పద్ధతిని అవలంబించాడు. బొమ్మలకు దుస్తులు తొడిగి, చేతిలో కర్రలు పెట్టి.. మనుషులను పోలి ఉండేలా సిద్ధం చేశాడు. కొబ్బరితోటలో ఉలవ చేనుకు రక్షణగా వీటిని కాపాలా పెట్టాడు.
అటువైపు వెళ్లే వారు వీటిని చూస్తూ.. ఉలవచేనులో విదేశీయులేంటని ఆశ్చర్యపోతున్నారు. దీని వల్ల పక్షులు, జంతువులు ఇటువైపు రావడం లేదని రైతు తెలిపాడు. అయితే కొత్తగా వచ్చే వారు చీకట్లో ఈ బొమ్మలను చూసి భయపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
– తగరపువలస
Comments
Please login to add a commentAdd a comment