మహారాణిపేట: ఐదు నెలలుగా బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని అధ్యాపకులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్టు ఫ్యాకల్టీ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు జి.రమేష్ మాట్లాడుతూ జిల్లాలో 46 మంది గెస్టు ఫ్యాకల్టీలకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రధాన కార్యదర్శి ఆర్.మహాదేవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment