విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే లైన్‌లో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఇస్లాంపేటకు చెందిన మహ్మద్ గౌస్ (36).. స్టీల్‌ప్లాంట్‌లోని రైల్వేకు చెందిన సురభీ ఎంటర్ ప్రైజెస్‌లో కాంట్రాక్ట్ కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి షిఫ్ట్ డ్యూటీకు వెళ్లాడు. సోమవారం ఉదయం విధి నిర్వహణలో భాగంగా సహ కార్మికుడు ఆలీతో ట్రాక్‌పై ఉన్న ట్యాంకర్‌కు ఇరువైపులా ఎయిర్ రిలీజ్ పనులు చేస్తున్నారు. రెండు బోగీలు అవతల పెద్ద శబ్దం వచ్చింది. భయంతో వెనక్కి వచ్చి చూడగా..గౌస్ ట్రాక్‌పై తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. ట్యాంకర్‌పై ఉన్న విద్యుత్ లైన్లు తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అధికారులకు ఆలీ సమాచారం అందించటంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్టీల్‌ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ తాతారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తాతారావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment