పింఛను తీసేస్తారేమోనని ఆందోళనతో..
తన కుమారుడు దివ్యాంగుడు. సర్వే పేరుతో అధికారులు ఇంటికి వచ్చి వివరాలు అడిగారు. చాలా మంది దివ్యాంగుల పెన్షన్లు తీసేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ఆందోళనతోనే బాధితుడు కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించాడు. గొల్లలపాలెంకు చెందిన దివ్యాంగుడు శ్రీనివాస్..తన తండ్రి అప్పారావు సాయంతో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదకకు వచ్చాడు. ఎప్పటినుంచో దివ్యాంగుల పెన్షన్ వస్తోందని, అయితే సర్వే పేరుతో పింఛన్ల కోత విధిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని అప్పారావు చెప్పారు.
కలెక్టర్‌కు అర్జీ సమర్పించి వస్తున్న దివ్యాంగుడు
Comments
Please login to add a commentAdd a comment