గాజువాక: 71వ అంతర్ జిల్లాల మహిళా, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 22వ తేదీ గాజువాక హైస్కూల్‌లో నిర్వహించనున్నట్టు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి.కోటేశ్వరరావు తెలిపారు. ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు అనకాపల్లి జిల్లా అనుకుపాలెం గ్రామంలో పోటీలు నిర్వహించనున్నారని చెప్పారు. పురుషులు 85 కిలోలు, మహిళలు 75 కేజీలలోపు బరువు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా సంప్రదించాలని వారు తెలిపారు. వివరాలకు 76800 05666, 98856 98717 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment